మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు
సంగారెడ్డి: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల పెళ్లికి తోడ్పాటును అందిస్తాయని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం పట్టణంలోని ఓ గార్డెన్‌లో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సంగారెడ్డి ఆర్డీఓ రాజేందర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
అక్షయపాత్ర సేవలు అమోఘం
కంది(సంగారెడ్డి): విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు ఆధ్యాత్మికతను పంచుతున్న అక్షయపాత్ర సేవలు అమోఘమని మంత్రి దామోదర కొనియాడారు. శనివారం మండల కేంద్రంలోని హరేకృష్ణ కల్చరల్ సెంటర్‌లో చేపట్టిన మహా నరసింహ హోమం, ఆలయం గర్భాలయ యంత్ర స్థాపనలో పాల్గొన్నారు. ఈసందర్భంగా అక్షయ పాత్రలో విద్యార్థులకు తయారు చేస్తున్న భోజనం, వా టిలో వినియోగిస్తున్న బియ్యం తదితర వస్తువు లు, కిచెన్ షెడ్డును పరిశీలించారు. విద్యార్థులకు భోజనం సరఫరా చేయనున్న రెండు వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు.
మంత్రి దామోదర రాజనర్సింహ


