ఎలాంటి పొరపాట్లకు తావివ్వం
మెదక్ కలెక్టరేట్: ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి, అదనపు అధికారి లోకేష్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్షించారు. ఈ ప్రక్రియను ఏఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలు, ఇతర ఎన్నికల సిబ్బందితో కలిసి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓలు రమాదేవి, మహిపాల్‌రెడ్డి, తహసీల్దార్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. భూభారతి రెవెన్యూ సమస్యలపై సమీక్ష నిర్వహించారు. పదిరోజుల్లో 1,000 దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్


