కార్మికులకు కేంద్రం అన్యాయం
నర్సాపూర్: కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేస్తూ అన్యాయం చేస్తుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం ఆరోపించారు. బుధవారం నర్సాపూర్‌లో సీఐటీయూ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికులకు రూ. 26 వేల కనీస వేతనం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, ఈఎస్‌ఐ, పీఎఫ్, కనీస సౌకర్యాలు కల్పనలో ప్రభుత్వాలు విఫలం చెందాయని మండిపడ్డారు. కార్మికుల సంక్షేమం కోసం సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. కాగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు మెదక్‌లో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాగరాజు, అసిఫ్, చంద్రయ్య, నర్సింలు, లక్ష్మయ్య, అనిల్, శంకరయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.


