మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి | - | Sakshi
Sakshi News home page

మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి

Oct 20 2025 9:18 AM | Updated on Oct 20 2025 9:18 AM

మా సమ

మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి

మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి డిసెంబర్‌లోగా పీఆర్సీ ప్రకటించాలి హీరో సుమన్‌ను కలిసిన కరాటే క్లబ్‌ సభ్యులు ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లకు 23 ఆఖరు పెండింగ్‌ డీఏలు వెంటనే ఇవ్వాలి: తపస్‌ కపాస్‌ కిసాన్‌ యాప్‌లో నమోదు తప్పనిసరి

మెదక్‌జోన్‌: ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావును పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మేడి సతీశ్‌రావు కోరారు. ఆదివారం పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఆయనను కలిసి పలు డిమాండ్లపై వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాను చార్మినార్‌ జోన్‌లో విలీనం చేయాలని, ఉపాధ్యాయుల పెండింగ్‌ బిల్లులను త్వరగా మంజూరు చేయటంతో పాటు జిల్లా కేంద్రంలో పీఆర్టీయూ భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించాలని కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు సామ్యానాయక్‌, సబ్బని శ్రీనివాస్‌తో పాటు జిల్లాలోని పలు మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మెదక్‌ కలెక్టరేట్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీని డిసెంబర్‌లోగా ప్రకటించాలని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు మల్లారెడ్డి ప్రభుత్వాన్ని ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. గత ప్రభుత్వం విస్మరించిన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. సీపీఎస్‌ రద్దు, మంచి ఫిట్‌మెంట్‌, పీఆర్సీ పెండింగ్‌లో ఉన్న డీఏలు, పెండింగ్‌ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రెండేళ్లు అయినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం సరికాదన్నారు.

మనోహరాబాద్‌(తూప్రాన్‌): మండలంలోని కాళ్లకల్‌కు చెందిన సన్‌షైన్‌ షోటోకాన్‌ కరాటే క్లబ్‌ సభ్యులు హీరో సుమన్‌ను ఆదివారం కలిశారు. ఈసందర్భంగా కరాటే అసోసియేషన్‌, పోటీలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తమ క్లబ్‌ ఆధ్వర్యంలో జరిగే నేషనల్‌ లెవల్‌ టోర్నమెంట్‌ గురించి సలహాలు తీసుకున్నట్లు క్లబ్‌ ఫౌండర్‌, అధ్యక్షుడు మల్లేశ్‌ తెలిపారు. వీరి వెంట మాస్టర్లు మహేశ్‌, శ్రీకాంత్‌, అభిలాశ్‌, తరుణ్‌, బాబి, అంజలి, తనుజ, స్పందన, నందిని తదితరులు ఉన్నారు.

పెద్దశంకరంపేట(మెదక్‌): ఓపెన్‌ స్కూల్‌లో ఇంటర్‌, పదో తరగతిలో చేరేందుకు ఈనెల 23వ తేదీ ఆఖరని ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌ విఠల్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓపెన్‌ స్కూల్‌లో చేరే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

నర్సాపూర్‌: ప్రభుత్వం పీఆర్సీని వెంటనే ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్లం, లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. ఇటీవల తపస్‌ నర్సాపూర్‌ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా ఎంపికై న శివకుమార్‌, రవికుమార్‌ను ఆదివారం సన్మానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, పెండింగ్‌ డీఏలను ఇవ్వాలని కోరారు. 317 జీఓ ద్వారా అన్యాయం జరిగిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ ప్రతినిధులు కొండల్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

రాయికోడ్‌(అందోల్‌): సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్మాలంటే రైతులు తప్పనిసరిగా కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్‌బుక్‌ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సారిక స్పష్టం చేశారు.

మా సమస్యలు ప్రభుత్వం  దృష్టికి తీసుకెళ్లండి  
1
1/2

మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి

మా సమస్యలు ప్రభుత్వం  దృష్టికి తీసుకెళ్లండి  
2
2/2

మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement