
అప్రమత్తంగా ఉండాలి
రామాయంపేట(మెదక్): అగ్ని ప్రమాదాల పట్ల ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ హెచ్చరించారు. ఆదివారం ఆయన స్థానిక ఫైర్‌స్టేషన్‌ను తనిఖీ చేసి మా ట్లాడారు. జిల్లాలో ఫైర్‌స్టేషన్ల సేవలు అమోఘమని, ఎక్కడ అగ్నిప్రమా దం సంభవించినా క్షణాల్లో అక్కడికి వెళ్లి మంటలు ఆర్పుతున్నారని పేర్కొన్నారు. ఈసందర్భంగా ఫైర్‌కు సంబంధించిన పరికరాలను పరిశీలించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆపద సమయాల్లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని ఆదేశించారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి ఏమైనా సమస్యలున్నాయా..? అని ఆరా తీశారు. ఈసందర్భంగా జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
హవేళిఘణాపూర్(మెదక్): విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. ఆదివారం మెదక్ మండలం పాతూర్ సబ్‌స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి సరఫరా తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకు ండా నిరంతరంగా విద్యుత్ సరఫరా కొనసాగించాలన్నారు. సిబ్బంది సమన్వయంతో పని చేయా లని సూచించారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్