
‘మద్యం’ దరఖాస్తుల గడువు పెంపు
అత్యధికంగా పోతంషెట్‌పల్లి వైన్స్‌కు
మెదక్ అర్బన్: లేదు.. లేదంటూనే మద్యం దుకాణాల దరఖాస్తు గడువును పెంచుతూ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 23 వరకు అవకాశం కల్పించగా, లక్కీ డ్రా 27న నిర్వహించనున్నారు. అయితే టార్గెట్ కోసం గడువు పెంచారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో 49 వైన్ షాపులుండగా, గతేడాది 1,905 దరఖాస్తులు రాగా, ఈసారి 1,369 మాత్రమే వచ్చాయి. గతంలో రూ. 38.10 కోట్ల ఆదాయం రాగా, ఈసారి రూ. 41.07 కోట్లు సమాకూరాయి. ఆదాయం పెరిగినా దరఖాస్తుల వారీగా చూస్తే తక్కువగా వచ్చాయి. అయితే గతేడాది కంటే దరఖాస్తులు ఎక్కువగా వచ్చేందుకు ఎకై ్సజ్ అధికారుల నానా ప్రయత్నాలు చేశారు. వైన్ బిజినెస్‌తో సంబంధం ఉన్న వారికి ఫోన్లు చేసి మరీ టెండర్లు వేయించినా, గత టార్గెట్ చేరలేకపోయారు. అయితే దరఖాస్తు రుసుము రూ. 3 లక్షలకు పెంచడం.. వైన్స్ దందాలో ఆశించిన లా భాలు రాకపోవడంతో దరఖాస్తులు తగ్గాయని.. దీంతో ఎకై ్సజ్ అధికారుల టార్గెట్ ఫలించలేదని తెలుస్తోంది. అయితే గడువు పెంపుతో టెండర్‌దారులకు కొత్త పోటీ ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.
ఈనెల 23 వరకు అవకాశం
జిల్లాలో గతేడాది 1,905, ఈసారి 1,369 దరఖాస్తులు
టార్గెట్ కోసమే అంటున్న టెండర్‌దారులు
18న బీసీ బంద్ ఉంటుందని సమాచారం ఉండటంతో టెండర్‌దారులంతా ముందే బ్యాంకు డీడీలు తీసి ఉంచారు. అయితే చివరి రోజు సాయంత్రం వరకు ఏ షాపుకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి. వాటి ఆఫ్ టెక్ ఎంత? లాభాల అవకాశాన్ని బేరీజు వేసుకొని షాపు దక్కే అవకాశాలను పరిశీలించి, చివరి సమయంలో షాపులను ఎంపిక చేసుకొని దరఖాస్తు చేశారు. శనివారం రాత్రి దాదాపు 12 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. జిల్లాలో అత్యధికంగా పోతంషెట్‌పల్లి వైన్స్‌కు 54 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా మెదక్ (గెజిట్ 45), నిజాంపేట (కల్వకుంట) షాపులకు 14 చొప్పు న దరఖాస్తులు అందాయి. అయితే చివరి సమయంలో శనివారం రాత్రి టెండర్ షెడ్యూల్ గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయ డంతో ఇప్పటికే టెండర్ వేసిన వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.