
పర్యాటక సొబగులు
●అర్బన్‌పార్కుకు మరిన్ని హంగులు ●ప్రారంభానికి సిద్ధమైన కాటేజీలు ●సందర్శకులకు సకల వసతులు
పర్యాటక పరంగా నర్సాపూర్ మరింత అభివృద్ధి చెందనుంది. ఇప్పటికే అర్బన్‌పార్కుకు సందర్శకుల తాకిడి పెరిగింది. అదే పార్కులో వారు బస చేసేందుకు అనువుగా నిర్మించిన కాటేజీలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈనెల చివరి వారంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
– నర్సాపూర్
నర్సాపూర్– హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకొని పట్టణ శివారులోని 258 హెక్టార్లలో అటవీశాఖ అర్బన్‌పార్కు ఏర్పాటు చేసింది. వాచ్ టవర్‌పైకి ఎక్కితే పచ్చని అడవి అందాలతో పాటు పట్టణానికి చెందిన రాయరావు చెరువు, పట్టణ వ్యూ పర్యాటకులకు ఆహ్లాదం పంచుతోంది. కాగా సాధారణ రోజుల్లో రోజుకు సుమారు 80 మ ంది వరకు పార్కుకు వస్తుండగా, సెలవు రోజుల్లో ఆ సంఖ్య రెట్టింపు అవుతోంది. అయితే అర్బన్‌పార్కును పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అటవీశాఖ అడుగులు వేసింది. పాత కాటేజీల పనులు పూర్తి చేయడంతో పాటు కొత్తగా మరిన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నీరు నిల్వ ఉండే ప్రాంతంలో 21 కాటేజీలు, ఒకే బ్లాక్‌లో ఉండే విధంగా మరో 12 కాటేజీలు, ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్, సెమినార్ హాల్, ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్, నెట్ క్రికెట్‌తో పాటు స్విమ్మింగ్ పూల్, పర్యాటకులకు భోజన సదుపాయం కల్పించేందుకు రెస్టారెంట్, దానిని ఆనుకొని కిచెన్ నిర్మాణాలు పూర్తయ్యాయి. కాగా కాటేజీల పరిసరాల్లో అక్కడక్కడ ఖాళీ స్థలంతో పాటు కొంత ఏరియాలో మొక్కలు నాటారు.
త్వరలోనే అందుబాటులోకి..
అర్బన్‌పార్కులో చేపట్టిన కాటేజీల నిర్మాణ పనులు పూర్తి కాగా, కాటేజీలు, రెస్టారెంట్, ఇతర భవనాల్లో ఫర్నిచర్ సమకూర్చాల్సి ఉంది. ఈ మేరకు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన సంస్థ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. కాగా స్థానిక ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారకపోతే ఈనెల చివరి వారంలో లేదా వచ్చె నెలలో కాటేజీలు ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అటవీశాఖ చర్యలు చేపడుతోంది. అర్బన్‌పార్కుతో ఇప్పటికే నర్సాపూర్ పర్యాటకంగా పేరు గడించింది. పార్కులో నిర్మించిన కాటేజీలు అందుబాటులోకి వస్తే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉ ంటుంది. మెదక్ జిల్లాతో పాటు సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అటవీశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.