
కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం
ఏఐసీసీ పరిశీలకురాలు జ్యోతి రౌతేలా
మెదక్‌జోన్: కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామని ఉత్తరాఖండ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఏఐసీసీ పరిశీలకురాలు జ్యోతి రౌతేలా అన్నా రు. ఆదివారం మెదక్‌లో డీసీసీ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పారదర్శక ఎన్నిక కోసం అన్నిస్థాయిల కార్యకర్తల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. మండల, బ్లాక్, జిల్లాస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు సందర్శిస్తున్నామన్నారు. పార్టీ కోసం పని చేసే నాయకులకు సముచిత ప్రాఽ దాన్యం లభిస్తుందన్నారు. ఈనెల 22న ఏఐసీసీకి నివేదిక సమర్పిస్తామని వివరించారు. సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్‌రావు, పీసీసీ కోఆర్డినేటర్లు అహ్మద్ నజీర్, వరలక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశురాంగౌడ్, నాయకులు ఆవుల రాజిరెడ్డి, హఫీజ్, మ్యాడం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.