
సేవలందించని రైతు వేదికలు
ప్రారంభానికి నోచుకోని ఫరీద్‌పూర్ రైతు వేదిక
అధ్వానంగా ర్యాలమడుగు రైతువేదిక
హవేళిఘణాపూర్(మెదక్): గత ప్రభుత్వ హయాంలో రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన రైతు వేదికలు అలంకారప్రాయంగా మిగిలాయి. క్లస్టర్ పరిధిలోని ఏఈఓలు కనీసం నిర్వహణను పట్టించుకోవడం లేదు. మండల పరిధిలోని ర్యాలమడుగు రైతువేదిక అధ్వానంగా మారింది. కనీసం వెళ్లేందుకు దారి కరువైంది. మెదక్, హవేళిఘణాపూర్ మండలాల పరిధిలోని అన్ని రైతు వేదికల పరిస్థితి ఇలాగే ఉంది. ఫరీద్‌పూర్‌లో నిర్మించిన వేదికను ఇప్పటివరకు ప్రారంభించలేదు. అధికారులు హవేళిఘణాపూర్, మెదక్ కార్యాలయాల్లోనే ఉంటూ రైతులను అక్కడికే రప్పించి పనులు చేస్తున్నారు. బూర్గుపల్లి శివారులో నిర్మించిన రైతు వేదిక సైతం ప్రారంభానికి నోచుకోకుండా పోయింది. ఇది మందుబాబులకు అడ్డాగా మారింది. ఇలాగే వదిలేస్తే అవి శిథిలావస్థకు చేరే అవకాశం ఉందని, ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రైతు వేదికలను వినియోగంలోకి తీసుకువచ్చేలా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
కనీస నిర్వహణ కరువు

సేవలందించని రైతు వేదికలు