
కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలి
మెదక్ మున్సిపాలిటీ: హామీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్ బాకీ కార్డ్‌ను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. ప్ర తిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను గుర్తు చేయడానికే కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రా రంభించినట్లు తెలిపారు. ఎకరానికి రూ. 15,000 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రూ. 2 లక్షల రుణమాఫీ ఊసేలేదని, రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి చేతులెత్తేశారన్నారు. ఈ మో సాలకు కాంగ్రెస్ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చాక పైళ్లెన ఆడబిడ్డలకు తులం చొప్పున బంగారం బాకీ అయ్యారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి