
పనుల్లో వేగం పెంచండి
కలెక్టర్ రాహుల్‌రాజ్
హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రంలో నిర్మిస్తున్న అధునాతన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌లో అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హవేళిఘణాపూర్ శివారులో ని ర్మించిన ఏటీసీని సందర్శించారు. విద్యార్థులకు బోధన, కోర్సుల వివరాలు, ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీ లించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సెంటర్‌లో శిక్షణ పొందడం ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు. కలెక్టర్ వెంట ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఏటీసీ నిర్వాహకులు, సిబ్బంది ఉన్నారు.