
4,987 కేసులు పరిష్కారం
మెదక్‌జోన్: రాజీయే రాజమార్గమని, చిన్నపాటి కేసులతో కోర్టులు, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరిగి విలువైన సమయంతో పాటు డబ్బులు వృథా చేసుకోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టుతో పాటు, నర్సాపూర్, అల్లాదుర్గం కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. వీటి పరిధిలో 4,967 కేసులను పరిష్కరించారు. ఇందుకు సంబంధించి రూ.1,04,88, 964 రికవరీ చేసినట్లు ఆమె వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌ఎం సుభవల్లి, సీనియర్ సివిల్ జడ్జి రుబీనా ఫాతిమా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సౌజన్య, స్పెషల్ మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ సాయి ప్రభాకర్, అన్ని కోర్టుల సిబ్బంది, పోలీసులు, కక్షిదారులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ