
తేలిన పంట నష్టం లెక్క
జిల్లావ్యాప్తంగా 1,237 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా, 15 ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. బాధితులకు ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయి తే క్షేత్రస్థాయిలో వారికి ఎలాంటి భరోసా ఇప్పటివరకు దక్కలేదు. అలాగే వరదలో కొట్టుకుపోయి ఇద్దరు దుర్మరణం చెందారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని అప్పట్లో ప్రభు త్వం ప్రకటించింది. కానీ వారికి నేటికీ పైసా అందలేదు. అలాగే దెబ్బతిన్న పంటలకు సంబంధించి ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పింది. ఈ మేరకు వారికి రూ.6.20 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే కూలిన ఇళ్లకు ఎంతమేర పరిహారం ఇస్తారనే విషయంపై అధికారులు స్పందించడం లేదు.
రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా పాలకులు ఫసల్ బీమా పథకం అమలు చేయడం లేదు. పంటలు దెబ్బతింటే ఎకరాకు రూ. 10 వేల చొప్పున ఇన్‌పుట్ సబ్సిడీ పేరుతో నామమాత్రంగా పరిహారం అందిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. అది కూడా రైతులకు సకాలంలో ఇచ్చిన దాఖలాలు లేవు. గత రబీ సీజన్‌లో అకాల వర్షాలకు 308 మంది రైతులకు సంబంధించి 376.16 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతినగా, ఇందుకు సంబంధించి ఎకరాకు రూ. 10 వేల చొప్పున రూ. 37.64 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ పరిహారం గురించి అధికారులను ఆరా తీయగా, తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పడం గమనార్హం.
గత నెల చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు మెతుకుసీమ అతలాకుతలం అయింది. రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసం కావడంతో పాటు భారీగా పంట నష్టం వాటిల్లింది. సుమారు 6,200 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈమేరకు ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు.
– మెదక్‌జోన్
బాధితులకు దక్కని భరోసా
పరిహారం కోసం ఎదురుచూపులు
జిల్లాలో 6,200 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
అత్యధికంగా వరికి నష్టం
నివేదిక తయారు చేసిన అధికారులు