
ఆదివారం శ్రీ 14 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
వర్షం.. ఆర్టీసీకి నష్టం
భారీ వర్షాలు ఆర్టీసీకి నష్టం మిగిల్చాయి. ఆగస్టు చివరి వారంలో మెతుకు సీమలో కురిసిన కుంభవృష్టితో భారీగా వరద పొటెత్తింది. దీంతో జిల్లావ్యాప్తంగా పంచాయతీరాజ్ పరిధిలో 63 కిలో మీటర్ల మేర 14 రోడ్లు ధ్వంసం కాగా, 15 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. అలాగే ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో 29 రోడ్లు ఉండగా, 53 కిలో మీటర్ల మేర ధ్వంసం అయ్యాయి. దీంతో మెదక్ నుంచి ఎల్లారెడ్డికి బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ నుంచి సిద్దిపేటకు ప్రతిరోజు పది బస్సులు నడుస్తాయి. సిద్దిపేట వరకు మెదక్ బస్సు వెళ్లడంతో రోజుకు రూ. 20 వేల ఆదాయం వస్తుంది. భారీ వర్షాల కారణంగా రోడ్డు తెగిపోవడంతో ప్రస్తుతం రామాయంపేట వరకే బస్సును నడిపిస్తున్నారు. దీంతో సగం ఆదాయం పడిపోయింది. ఈ లెక్కన ఈ రూట్‌లో ఇప్పటివరకు రూ. 15 లక్షల ఆదాయం తగ్గింది. అలాగే ఎల్లారెడ్డి రూట్‌లో మెదక్ బస్సులు రోజుకు 5 చొప్పున నడుస్తాయి. ఒక్కో ట్రిప్‌కు రూ. 2 వేల చొప్పున రోజుకు రూ. 10 వేల ఆదాయం వస్తుంది. పోచారం డ్యాం పొంగిపొర్లి రోడ్డు తెగిపోవడంతో 5 రోజులు బస్సులను నిలిపివేశారు. దీంతో సుమారు రూ. 1.30 లక్షల నష్టం వాటిల్లింది. అలాగే పాపన్నపేట రూట్‌లో బొడ్మట్‌పల్లి వరకు రోజుకు 6 బస్సులు నడుస్తాయి. రెండు రోజులు బస్సులు నిలిచి పోవడంతో సుమారు రూ. 1.50 లక్షల నష్టం చేకూరింది. ఇలా మొత్తం 5 రోజుల పాటు ఆయా రూట్లలో 42,090 కిలో మీటర్లు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా మెదక్ డిపో రూ. 2,69,580 ఆదాయం కోల్పోయినట్లు డీఎం సురేఖ తెలిపారు.
– మెదక్ కలెక్టరేట్
● ఐదు రోజులు.. 42,090 కిలో మీటర్లు రద్దు
● ఐదు రోజులు.. 42,090 కిలో మీటర్లు రద్దు
● మెదక్ డిపోకు రూ. 2,69,580 లక్షలు నష్టం
● మెదక్ డిపోకు రూ. 2,69,580 లక్షలు నష్టం

ఆదివారం శ్రీ 14 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025