
సాహిత్యం మరింత బలపడాలి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో సాహిత్యం మరింత బలపడాలని, ఇందుకోసం కవులు కృషి చేయాలని తెలంగాణ రచయితల సంఘం (తెరసం) జిల్లా అధ్యక్షురాలు కవిత అన్నారు. శనివారం తెరసం ఆధ్వర్యంలో ప్రముఖ సినీ గేయ రచయిత సాయిసిరిని ఘనంగా సన్మానించారు. సాయిసిరి ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. అనంతరం సమాజంలో ఉపాధ్యాయులు అనే అంశంపై కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో తెరసం సభ్యులు అంజాగౌడ్, గీత, అంజలి, కవిత, సరళ, లింగాగౌడ్, సంతోశ్,వెంకటేశం, నవీన్ తదితరులు పాల్గొన్నారు.