
42 శాతం రిజర్వేషన్లు చరిత్రాత్మకం
నర్సాపూర్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని పలువురు కాంగ్రెస్ నాయకులు అన్నారు. మంగళవారం పార్టీ చేపట్టిన సంబరాలలో భాగంగా స్థానిక పిల్లల పార్కులోని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. పీసీసీ సీనీయర్ ఉపాధ్యక్షుడు ముజాహిద్ ఆలంఖాన్, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి పాల్గొని మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు. తమ నేత రాహుల్‌గాంధీ సూచనల మేరకు సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేశారని వారు అన్నారు. ఈ విషయంలో రాష్ట్రం దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. సంబరాలలో భాగంగా మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. నర్సాపూర్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మంగళవారం ఆ పార్టీ నాయకులు ప్రారంభించారు.