
ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం
డీఈఓ రాధాకిషన్
వెల్దుర్తి(తూప్రాన్): ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, దాతల సహకారం తోడైతే మరింత అభివృద్ధి చెందుతాయని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు. మంగళవారం మండలంలోని ఎం.జలాల్‌పూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు రంగి కృష్ణ సుమారు వంద మంది విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ పంపిణీ చేయగా, డీఈఓ ముఖ్య అతిధిగా హాజరై అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ సీతారాం, రిటైర్డ్ ఎంఈఓ యాదగిరి, హెచ్‌ఎం సురేశ్‌కుమార్, ఎస్జీటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం, ప్రణీత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.