
నూతన కార్యవర్గం ఎన్నిక
నిజాంపేట(మెదక్): నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా ఆధ్యక్షుడు శంకర్ దయాళ్ చారి ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మంగళవారం నిజాంపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా అజ్గర్, ఉపాధ్యక్షుడుగా నవీన్‌రెడ్డిని ఎన్నుకున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా జీడీ. చంద్రకాంత్‌గౌడ్, కోశాధికారి బండారి సిద్ధరాములు, సహాయ కార్యదర్శిలుగా బాలరాజ్, శ్రీకాంత్, సలహాదారులుగా భైరవరెడ్డి, భరత్ రెడ్డి, ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిజాంపేట మండల ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడుగా అజ్గర్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా పాత్రికేయులకు డబుల్ బెడ్ రూమ్, ఇళ్ల స్థలాల విషయంలో అందరికీ న్యాయం చేసేలా ముందుకెళ్తామన్నారు.