
కాళేశ్వరంపై ఆరోపణలు మానుకోవాలి
టేక్మాల్(మెదక్): కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప అన్నారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందంటూ నిరసనగా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు మంగళవారం మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వీరప్ప మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, ఎంతోమంది రైతులకు మేలు జరిగే కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో బీఆర్‌ఎస్ పార్టీని బదనాం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హీమీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమై అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. నాయకులు సిద్ధయ్య, భాస్కర్, రాజేందర్, సుధాకర్, ఈశ్వరప్ప, రాజుగౌడ్, సాయిబాబ, మహేందర్, మతిన్, సురేశ్, మల్లేశం, బసంత్‌రావ్, సంగయ్య, రజాక్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ రాస్తారోకో
అల్లాదుర్గం(మెదక్): కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. బీఆర్‌ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టేందుకు సీబీఐ విచారణకు అదేశించడంపై పార్టీ ఆదేశాల మేరకు అల్లాదుర్గంలో మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. ఆందోళన చేపడుతున్న బీఆర్‌ఎస్ నాయకులను ఎస్‌ఐ శంకర్ అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు నర్సింలు, బేతయ్య, కృష్ణగౌడ్, పవన్, నర్సప్ప, నర్సింలు, అశోక్‌గౌడ్, శివరాం, రమేశ్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరప్ప

కాళేశ్వరంపై ఆరోపణలు మానుకోవాలి