
విద్యతో పాటు క్రీడలూ ముఖ్యం
అల్లాదుర్గం(మెదక్): విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు అవసరమేనని అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి అన్నారు. మంగళవారం ముస్లాపూర్ జెడ్పీ పాఠశాలలో మండల స్థాయి పాఠశాల క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు. పోటీల్లో గెలుపోటములు సహజమన్నారు. ఓటమితో కుంగిపోకుండా, ఓటమి గెలుపునకు నాంది కావాలన్నారు. గ్రామీణా ప్రాంతాలో ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారని, వారికి తగిన ప్రోత్సాహం లేదన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ధనుంజయ్య, జెడ్పీ పాఠశాల హెచ్‌ఎంలు రమేశ్, లక్ష్మన్, నర్సింలు, రవి, కేజీబీవీ ప్రిన్సిపాల్ స్రవంతి, పీఆర్టీయూ నాయకులు జనార్దన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
చదువుతోపాటు క్రీడలు అవసరం
శివ్వంపేట(నర్సాపూర్): క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రామిరెడ్డి, ఎంఈఓ బుచ్చనాయక్, నర్సాపూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గోమారం హై స్కూల్ ప్రాంగణంలో మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. .చదువుతో పాటు ఆటల పట్ల విద్యార్థులు ఆసక్తి కనబరచాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ప్రయాణ, ఇతర ఖర్చుల నిమిత్తం పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రామిరెడ్డి రూ.20 వేల అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాలల క్రీడాకారులు పాల్గొన్నారు.
నర్సాపూర్‌లో...
నర్సాపూర్: మండల స్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆటల పోటీలను మంగళవారం స్థానిక అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాల ఆవరణలో ఎంఈఓ తారాసింగ్ ప్రారంభించారు. పోటీల్లో పలు పాఠశాలల నుంచి సుమారు ఐదు వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
వర్షంతో నిలిచిన క్రీడలు
పాపన్నపేట(మెదక్): మండల కేందరంలో మంగళవారం ఎస్‌జీఎఫ్ క్రీడలను యువనాయకుడు అహ్మద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు చదువుల్లో భాగం కావాలన్నారు. అనంతరం వర్షం ప్రారంభం కావడంతో ఆటల పోటీలను వాయిదా వేశారు. హెచ్‌ఎం మహేశ్వర్ ,పీఈటీలు, విద్యార్థులు, టీచర్లు ,క్రీడాకారులు పాల్గొన్నారు.

విద్యతో పాటు క్రీడలూ ముఖ్యం