
రంగు మారిన తాగు నీరు
రామాయంపేట/నిజాంపేట(మెదక్): నిజాంపేట మండలం కే వెంకటాపూర్ తండాలో తాగు నీరు కలుషితమవుతుంది. అయితే తండాకు మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతున్నా, అవి తాగితే జలుబు చేస్తుందనే అనుమానంతో వారు బోరు నీటిపై ఆధారపడుతున్నారు. తండాకు దూరంగా ఉన్న బోరు నుంచి ట్యాంకుకు నీరు సరఫరా అవుతుంది. కాగా సదరు బోరు వ్యవసాయ భూమిలో ఉండటంతో రాత్రి కురిసిన వర్షానికి బోరు చుట్టూ నిలిచిన కలుషిత నీరు లోనికి వెలుతుంది. ఈ నీటినే ట్యాంకులోకి సరఫరా చేస్తుండగా, వాటిని గిరిజనులు తాగుతున్నారు. తండాకు ప్రతిరోజూ సరఫరా అవుతున్న భగీరథ నీటిని ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఈవిషయమై భగీరథ ఏఈ భిక్షపతిని వివరణ కోరగా.. స్వచ్ఛమైన భగీరథ నీటినే తాగాలని తాము పలుమార్లు చెప్పినా, గిరిజనులు వినడం లేదన్నారు. కలుషితమవుతున్న ట్యాంకు నీరు తాగితే వ్యాధుల భారిన పడే అవకాశం ఉందనిపేర్కొన్నారు.

రంగు మారిన తాగు నీరు