
కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు
చిన్నశంకరంపేట(మెదక్): విద్యార్థులు ఏకాగ్రతతో చదివినప్పుడే మంచి భవిష్యత్తును పొందగలరని రాష్ట్ర మోడల్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీనివాసచారి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మో డల్ స్కూల్‌ను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ద్వితీయ సంవత్సరం సీఈసీ విద్యార్థులతో మాట్లాడారు. బైపీసీ, ఎంపీసీ గ్రూపులను మించి మంచి భవిష్యత్తును సీఈసీ ద్వారా పొందవచ్చన్నారు. గ్రూప్–1 ఉద్యోగాలను ఎక్కువగా సీఈసీ విద్యార్థులే సాధిస్తున్నారన్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పలు ప్రశ్నలు వేసి వారి ప్రతిభను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించడంతో పాటు ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం మధ్యా హ్న భోజనాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీదేవికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట డిప్యూటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్, ఏఎంఓ రవికుమార్ ఉన్నారు.
మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారి