
ఒకేరోజు ముగ్గురు అధికారులు బాధ్యతల స్వీకరణ
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో మంగళవారం ఒకేరోజు ముగ్గురు అధికారులు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. జిల్లా వ్యవసాయ అధికారిగా ఇక్కడ పనిచేసిన గోవింద్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో వ్యవసాయ శాఖ టెక్నికల్ అధికారి వినయ్‌కుమార్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆత్మ నాగర్ కర్నూల్‌నందు పని చేస్తున్న దేవ్‌కుమార్ బదిలీపై వచ్చి నూతన వ్యవసాయ అధికారిగా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అలాగే సంగారెడ్డి జిల్లా మెప్మాపీడీగా పనిచేస్తున్న గీత బదిలీపై వచ్చి మెదక్ జెడ్పీడీప్యూటీ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు జిల్లా మెడికల్ కళాశాల నూతన ప్రిన్సిపాల్‌గా నితిన్ కబ్రా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన ముగ్గురు అధికారులు కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆయన చాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు.