
బాలికలు ఉన్నతంగా చదువుకోవాలి
అదనపు కలెక్టర్ నగేశ్
చేగుంట(తూప్రాన్): బాలికలు ఉన్నతంగా చదువుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. సోమవారం సాయంత్రం మండలంలోని రెడ్డిపల్లి కాలనీ కేజీబీవీని డీఈఓ రాధాకిషన్‌తో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో అందిస్తున్న ఆహారంతో పాటు వసతుల కల్పనపై ఆరా తీశారు. నూతనంగా ఏర్పాటైన నార్సింగి కేజీబీవీ విద్యార్థినులు సైతం రెడ్డిపల్లి కాలనీలోనే చదువుకుంటున్నారని, వసతులు సరిపోవడం లేదని ఉపాధ్యాయులు వివరించారు. త్వరలోనే తగిన గదులను పరిశీలించి నార్సింగి మండల విద్యార్థులను తరలించే ఏర్పాట్లు చేస్తానని డీఈఓ హామీ ఇచ్చారు. వారి వెంట ఎంఈఓ నీరజ, పాఠశాల ఎస్‌ఓ శ్రీవాణి, సిబ్బంది ఉన్నారు.