
ఎంసీహెచ్‌లో సంపూర్ణ వైద్య సేవలు
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్‌జోన్/మెదక్ కలెక్టరేట్: మాతా, శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు, బాలింతలకు సంపూర్ణ వైద్య సేవలు అందుతున్నాయని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నవజాత శిశువుల ప్రత్యేక విభాగాన్ని పరిశీలించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిలో జూన్‌లో 350 ప్రసవాలు నిర్వహించారన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్‌కు సంబంధించి 50 మేజర్ సర్జరీలు జరగటం హర్షణీయం అన్నారు. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో గర్భిణులను ఎప్పటికప్పుడు ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు పరిశీలించి ఎంసీహెచ్‌కు తరలించి ప్రసవాలతో పాటు వైద్యం అందిస్తున్నారన్నారు. ఆస్పత్రిలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీతతో పాటు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహాన్ని సందర్శించారు. హాస్టళ్ల మరమ్మతులకు రూ. 2.21 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.