
కార్మికుల శ్రేయస్సు పట్టని ప్రభుత్వాలు
మెదక్ కలెక్టరేట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై భారం వేస్తూ.. పెట్టుబడిదారులకు మేలు చేస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని గంటలు పెంచి కార్మికులపై భారం వేస్తున్నాయని మండిపడ్డారు. కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్న సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలు జిల్లాలో మొదటిసారిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈఏడా ది డిసెంబర్ 7, 9 తేదీల్లో జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 19న ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం మెదక్‌లో ఉంటుందన్నారు. సమావేశంలో ఎన్‌పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలమణి, కార్యదర్శి మల్లేశం, కోశాధికారి నర్సమ్మ, ఉపాధ్యక్షులు మహేందర్‌రెడ్డి, నాగరాజు, సహాయ కార్యదర్శి గౌరయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేష్, నాయకులు అజయ్ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు