
ప్రజల హృదయాల్లో సజీవం
నర్సాపూర్: మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భౌతికంగా లేకపోయినా ప్రజల హృదయాల్లో సజీవంగా ఉన్నారని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ పేర్కొన్నారు. మహానేత వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని పిల్లల పార్కులో ఆయన విగ్రహానికి పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన పేదలు, రైతుల పక్షపాతిగా పేరు గడించారని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి, సొసైటీ చైర్మన్ రాజుయాదవ్, పార్టీ నాయకులు రిజ్వాన్, మల్లేష్, రవీందర్‌రెడ్డి, చిన్న ఆంజిగౌడ్, నరేందర్‌రెడ్డి, విశ్వంబరస్వామి, రషీద్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
హన్మంతాపూర్‌లో ఇండ్లకు పూజలు
నర్సాపూర్ మున్సిపాలిటీలోని హన్మంతాపూర్‌లో మంగళవారం డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి పలువురు పార్టీ నాయకులతో కలిసి ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజలు చేశారు.