ప్రధాని మోదీ రైతు పక్షపాతి
మెదక్‌జోన్: ప్రధాని నరేంద్ర మోదీ రైతు పక్షపాతి అని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత క్వింటాల్ ధాన్యానికి రూ. 2,300 మద్ద తు ధర వస్తుందన్నారు. అంతకుముందు కేవలం రూ. 1,300 మాత్రమే లభించేదన్నారు. పెట్టుబడి సాయం కోసం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఒక్కో రైతుకు ఏడాదికి రూ. 6 వేల చొప్పున ఖాతాల్లో జమచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో నేటికీ 20 శాతం మంది రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ కాలేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటుతుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు అంజయ్య, వె ంకట్‌రెడ్డి, ఎంఎల్‌ఎన్‌రెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.
కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి


