కార్మికశాఖ సహాయ అధికారి ఘెరావ్
నారాయణఖేడ్: ఖేడ్ కార్మికశాఖ సహాయ అధికారి గిరిరాజును బుధవారం వివిధ గ్రామాల బాధితులు నిలదీశారు. కార్మికశాఖ కార్డులు కలిగి ఉన్న మహిళా కార్మికుల మొదటి, రెండవ కాన్పులకు ప్రభుత్వం రూ. 30 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని, దరఖాస్తు చేసుకొని ఏడాది దాటినా ప్రక్రియ ప్రారంభించకపోగా, నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారంటూ వాగ్వాదానికి దిగా రు. కొత్తగా కార్డులు కావాల్సిన వారికి సైతం ముడుపులు డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. బాధితులకు కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు.
తడి, పొడి చెత్తపైఅవగాహన అవసరం
జోగిపేట(అందోల్): తడి, పొడి చెత్త వినియోగంపై విద్యార్థులకు అవగాహన అవసరమని మున్సిపల్ కమిషనర్ తిరుపతి అ న్నారు. బుధవారం జోగిపేటలోని ఓ పాఠశాలలో వంద రోజుల ప్రణాళికలో భాగంగా వ్యర్థాల నిర్వహణ, ఎరువుల తయారీపై వ్యా సరచన పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు మంచి ప్రకృతిని అందించాలన్నారు.


