
అడ్మిషన్ ప్లీజ్
కిక్కిరిసిన తునికి ఎంజేపీ
కౌడిపల్లి(నర్సాపూర్): బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం మండలంలోని తునికి ఎంజేపీ (మహాత్మ జ్యోతిబా పూలే) బీసీ గురుకులంలో శనివారం నిర్వహించిన కౌన్సెలింగ్‌కు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్‌సీఓ గౌతంకుమార్‌రెడ్డి, గురుకుల ప్రిన్సిపాల్ హరిబాబు ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో మొత్తం 979 బ్యాక్‌లాగ్ సీట్లు ఉండగా, ఉమ్మడి జిల్లా నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కౌన్సెలింగ్ కోసం వచ్చిన వారి వాహనాలు జాతీయ రహదారికి ఇరువైపులా నిలపడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు.

అడ్మిషన్ ప్లీజ్