
వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి
జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరాం
రామాయంపేట(మెదక్): ఉద్యోగులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించకపోతే చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరాం హెచ్చరించారు. మంగళవారం ఆయన మండలంలోని ప్రగతి ధర్మారంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలతో మాట్లాడారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఈ మేరకు ఆసుపత్రిలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఇతర మందులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వడదెబ్బకు గురైనవారికి వెంటనే సపర్యలు చేపట్టాలని, ముఖ్యంగా గర్భవతులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఆసుపత్రి డాక్టర్ హరిప్రియ, ఏఎన్‌ఎంలు ఉన్నారు.
ధాన్యం కొనుగోళ్లు
వేగవంతం చేయండి
తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి
వెల్దుర్తి(తూప్రాన్): వర్షాలు ప్రారంభమవుతున్న దృష్ట్యా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా చేయాలని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి ఆదేశించారు. మండలంలోని హస్తాల్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొను గోలు కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. కాంటాలో మోసం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని తెలిపారు. కాంటా వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లులకు తరలించడంతో పాటు రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్ బాలాలక్ష్మి, ఏఓ ఝాన్సీ, గిర్దావర్ నర్సింగ్‌యాదవ్ పాల్గొన్నారు.
ధాన్యం తడిసిపోకుండా జాగ్రత్తలు: డీఆర్‌ఓ
చేగుంట(తూప్రాన్): మండలంలోని వడియారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఆర్‌ఓ భుజంగరావు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. ధాన్యం తడిసిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కొనుగోలు వివరాలను వెంటనే నమోదు చేసి డబ్బులు రైతులకు త్వరగా వచ్చేలా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీకాంత్, ఏపీఎం లక్ష్మినర్సమ్మ, ఆర్‌ఐలు భరత్‌రెడ్డి, సంతోష్‌రావు పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు
కల్గించవద్దు: డీఆర్‌డీఓ
కౌడిపల్లి(నర్సాపూర్): రైతులకు ఇబ్బందులు లేకుండా వరిధాన్యం కొనుగోలు చేయాలని డీఆర్‌డీఓ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మండలంలోని వెంకట్రావ్‌పేటలో ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం తేమశాతం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా వరిధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. నిర్వాహకులు ధాన్యం తూకం చేయగానే రైతుల వివరాలు తీసుకుని ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలన్నారు. గోనె సంచులు ఇతర సమస్యలుంటే వెంటనే తెలియచేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన వడ్లు తీసుకురావాలన్నారు. తూకంలో తరుగు పేరున ఎక్కువ వడ్లు తూకం వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సంగమేశ్వర్, సీసీలు నాగరాజు, నర్సింలు, శ్రీకాంత్, ఎఫ్‌పీసీ చైర్మన్ రాజేశ్వరీ రైతులు పాల్గొన్నారు.

వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి

వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి