రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర
కొల్చారం(నర్సాపూర్)/కౌడిపల్లి: బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చి, దేశంలోని ప్రజలను మతాలు, కులాల వారీగా విభజించాలని చూస్తోందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ ఆరోపించారు. గురువారం మండలంలోని సంగాయిపేట నుంచి రంగంపేట అంబేడ్కర్ విగ్రహం వరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశంగౌడ్, ఉపాధ్యక్షుడు గోవర్దన్, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆగంగౌడ్, జిల్లా నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చందు, నాయకులు ప్రవీణ్‌రెడ్డి, అనిల్ మధుసూదన్‌రెడ్డి, వెంకట్‌గౌడ్, శేఖర్, మల్లారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. అలాగే కౌడిపల్లి మండలంలోని వెల్మకన్నలో నిర్వహించిన పాదయాత్రలో ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులుగౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్


