చిన్నారులు, వృద్ధులు,
గర్భిణులకు ముప్పు
ఎండ వేడికి చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు త్వరగా ఇబ్బందులకు గురవుతారని జిల్లా వైద్యాధికారిని సూచించారు. ఉదయం 9 గంటలు దాటితే బయటకు వెళ్లవద్దని, తప్పనిసరైతేనే తగిన జాగ్రత్తలతో వెళ్లాలని, సాయంత్రం 5 గంటల తరువాతనే బయటకు వెళ్లాలని సూచించారు. వృద్ధుల్లో వేడిని తట్టుకునే స్థాయి తక్కువ కావడం వల్ల గుండె సంబంధిత సమస్యలు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. చెమట అధికంగా రావడం వల్ల అలసటకు గురై, అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది.
మంచిర్యాలటౌన్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మంచిర్యాల జిల్లా రెడ్ జోన్‌గా ప్రకటించారు. సోమవారం 43.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత జిల్లాలో నమోదు కాగా, మరో మూడు రోజుల పాటు రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జిల్లాలో 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. దీనికి వడగాల్పులు కూడా తోడవుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత సూచిస్తున్నారు. ఈ వారం రోజులు వడగాల్పులు ఎక్కువగా వీచడంతో పాటు, ఎండలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉండడంతో వడదెబ్బకు గురయ్యే ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. ఎండ వేడి పెరగడంతో అత్యవసర పనులు ఉన్నవారే బయటకు వెళ్లాలని, తలకు ఎండ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, సరిపడా నీరు తాగడం, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవడం, శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే బట్టలను వేసుకోవడం, వీలైనంత వరకు నీడన ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే 108కు సమాచారం ఇవ్వాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ఎండ వేడితో వడదెబ్బ
ఎండలు పెరగడంతో శరీర ఉష్ణోగ్రతను నియంత్రి ంచుకోలేని స్థితికి చేరితే, శరీరంలోని ఎలక్ట్రోలైట్స్, మినరల్స్, నీటిశాతం తగ్గి(డీహైడ్రేషన్) సత్తువలేని స్థితికి చేరటం వల్ల వడదెబ్బ వస్తుంది. దీనివల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, కండరాలు గట్టిపడడం, చర్మం ఎర్రగా మారటం, వాంతి వచ్చినట్లు ఉండట ం, వాంతి చేసుకోవడం, మూర్చరావడం, తలనొ ప్పి, కోమాలోకి వెళ్లటం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. వడదెబ్బ సోకిన రోజుకు 10 నుంచి 15 గ్లాసుల నీరు తాగాలి. పండ్లు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, చెరుకు రస ం ఎక్కువగా తీసుకోవాలి. తెల్ల రంగు బట్టలు ధరించాలి. బయటకు ఎండలో వెళ్లేవారు గొడుగు, నల్ల కళ్లద్దాలు ధరించాలి. మసాలాలు, కారం, నూనెలు, ఫాస్ట్‌ఫుడ్, మత్తుపానీయాలకు దూరంగా ఉండాలి.


