అత్తింటివారి కిరాతకం
పథకం ప్రకారమే హత్య చేశారని మహిళ తండ్రి ఫిర్యాదు
పోలీసుల అదుపులో నిందితులు
ఠాణా ఎదుట మృతురాలి బంధువుల ఆందోళన
చెన్నూర్‌రూరల్: అదనపు కట్నం కోసం.. ఓ మహిళను, భర్త, అత్త, మామ, ఆడపడుచు మరో వ్యక్తితో కలిసి అతి కిరాతకంగా హతమార్చిన ఘటన చెన్నూర్ మండలం ఎల్లక్కపేటలో సోమవారం జరిగింది. తల్లి మృత్రి, తండ్రి జైలుకు వెళ్లడంలో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. చెన్నూర్ ఎస్సై శ్యామ్ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లక్కపేటకు చెందిన చల్ల రమేశ్‌కు గోదావరిఖనిలోని రాజీవ్‌నగర్‌కు చెందిన శారదతో ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి రెండేళ్ల బాబు, మూడు నెలల శిశువు ఉన్నారు.
అదనపు కట్నం కోసం..
రమేశ్ కొన్ని రోజులుగా అదనపు కట్నం కోసం శారదను వేధిస్తున్నాడు. రమేశ్‌కు అతని తల్లి వెంకమ్మ, తండ్రి అబ్బయ్య, సోదరి పుష్పలత కూడా తోడయ్యారు. మరోవైపు ఇంటి నిర్మాణం ప్రారంభించడంతో డబ్బులు తీసుకురావాలని వేధిస్తున్నారు. గతంలో గోదావరిఖనిలో కుల పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయినా వారిలో మార్పు రాలేదు. డబ్బులు తీసుకురాకపోవడంతో ఇటీవల శారదను కూలీ పనికి వెళ్లాలని వేధిస్తున్నారు. దీంతో ఇటీవల మరోమారు పంచాయితీ జరిగింది.
అనాథలైన ఇద్దరు చిన్నారులు


