ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

May 19 2026 12:16 AM | Updated on May 19 2026 12:16 AM

బెల్లంపల్లి: బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. సోమవారం బెల్లంపల్లి వన్‌టౌన్‌ను సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. సిబ్బంది పని తీరు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు, రౌడీ షీట ర్లు, అనుమానితుల వివరాలు, పెండింగ్‌లో ఉన్న కేసుల రికార్డులను పరిశీలించారు. ప్రతీ కానిస్టేబుల్‌ కాలనీలను సందర్శించి ప్రజలతో సత్సంబంధాలు ఏర్పర్చుకోవాలన్నారు. వాహన దారులకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలన్నారు. ఆయన వెంట డీసీపీ ఎగ్గడి భాస్కర్‌, ఏసీపీ వి.కిరణ్‌కుమార్‌, వన్‌టౌన్‌ ఎస్‌హెచ్‌ఓ కె.శ్రీనివాసరావు ఉన్నారు.

విద్యుత్‌ శాఖ అధికారుల ఘెరావ్‌

తాండూర్‌: విద్యుత్‌ శాఖ అధికారులకు సోమవారం అచ్చలాపూర్‌లో చుక్కెదురైంది. ఆదివారం గ్రామ శివారులో విద్యుత్‌ ప్రమాదంతో ట్రాక్టర్‌ ట్రాలీ దగ్ధమైన విషయం తెలుసుకొని పంచనామాకు వెళ్లిన ఆ శాఖ ఏఈ జాన్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, జూని యర్‌ లైన్‌మెన్‌ మహదేవ్‌లను గ్రామస్తులు సుమా రు 3 గంటల పాటు నిర్బంధించారు. గ్రామ ంలో దాదాపు 15 చోట్ల విద్యుత్‌ తీగలు వేలాడుతున్నప్పటికీ అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. ఆదివారం జరిగిన ప్రమాదంలో యువరైతు, ట్రాక్టర్‌ డ్రైవర్‌ తృటిలో ప్రాణాపా య ం నుంచి తప్పించుకున్నారని, ఒకవేళ ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. బాధిత రైతు కు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎస్సై ప్రసాద్‌ అధికారులు, స్థానికులతో మాట్లాడారు. మూడు నెలల్లోగా రైతుకు నష్టపరిహారం అందిస్తామని, విద్యుత్‌ తీగలను త్వరితగతిన సరిచేస్తామని అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళ న విరమించారు. ఉపసర్పంచ్‌ గట్టు సంతోష్‌ కుమా ర్‌, నాయకులు మారిశెట్టి శ్రీనివాస్‌, కొండు సాయి, మాజీ ఉప సర్పంచ్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement