గంజాయి రవాణా చేస్తే పీడీయాక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి రవాణా చేస్తే పీడీయాక్ట్‌

May 19 2026 12:16 AM | Updated on May 19 2026 12:16 AM

మంచిర్యాలక్రైం: గంజాయి రవాణా చేస్తే పీడీయాక్ట్‌ నమోదు చేస్తామని సీఐ ప్రమోద్‌రావు హెచ్చరించారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, స్థానిక డీసీపీ ఎగ్గడి భాస్కర్‌ ఆదేశాల మేరకు సోమవారం ఏసీపీ ప్రకాష్‌ పర్యవేక్షణలో జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లో స్థానిక సీఐ నార్కోటిక్‌ స్నీపర్‌ డాగ్‌, సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ కార్గో పార్సిళ్లను సైతం తనిఖీ చేశారు. సినిమా థియేటర్‌లో, సమీపంలోని పాన్‌షాపులో, బేకరీ ఐటం విక్రయించే వారి వద్ద తనిఖీలు చేశారు. అనంతరం సీఐ మాట్లాడుతూ కొరియర్స్‌, పార్సిల్‌ ద్వారా, బస్సుల్లో, రైలు మార్గం గుండా గంజాయి రవాణ జరుగుతున్నట్లు సమాచారం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మధుసూదన్‌, డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది, స్పెషల్‌ పార్టీ బృందం పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement