పాతమంచిర్యాల: కనీస వేతనం, హెచ్‌ఆర్ పాలసీ ప్రమాధబీమా, ఆరోగ్యబీమా, ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో ఈ నెల 19 నుంచి వీవోఏలు నిరవధిక సమ్మె చేస్తున్నట్లు వీవోఏల జేఏసీ జిల్లా కన్వీనర్ జంబోజుల వెంకటేష్, కుంటాల కుమార్, కో కన్వీనర్‌లు పొట్ట పోషం, జాడి స్వరూపరాణి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జిల్లాలోని 16 మండలాల అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ డిమాండ్లు నెరవేర్చాలని ఈ నెల 4న రాష్ట్ర గ్రామీణాభివృద్ది సంస్థ కమిషనర్, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్‌కు వినతి పత్రం ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు.


