పెంబి: స్నానం చేద్దామని చెరువుకు వెళ్లిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన సోమవా రం పెంబి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మందపల్లి గ్రామానికి చెందిన చెరుపూరి సంధ్య–నారాయణ దంపతుల ఎకై క కూమారుడు చెరుపూరి మనోజ్(21) గ్రామంలోని పాత చెరువులో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో స్నానానికి వెళ్లాడు. లోతు తెలియకపోవడం, ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. కొడుకు ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు వద్దు వెళ్లాడు. అక్కడ బట్టలు కనిపించడంతో ఈతగాళ్లతో గాలించారు. మృతదేహం దొరికింది. ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


