బానిసెల్‌ కావొద్దని.. | - | Sakshi
Sakshi News home page

బానిసెల్‌ కావొద్దని..

May 19 2026 12:10 AM | Updated on May 19 2026 12:10 AM

● చాకెపల్లిలో సమ్మర్‌ క్లాస్‌లు ● సర్పంచ్‌ చొరవతో నిర్వహణ ● ప్రత్యేకంగా టీచర్‌ నియామకం ●

చెన్నూర్‌రూరల్‌: ఒకప్పుడు సెలవులు వచ్చాయనంటే.. ఊళ్లకు వెళ్లడం, సెలవుల్లో అమ్మానాన్నలక సహాయం చేయడం, కొత్త పనులు నేర్చుకోవడం, ఈత నేర్చుకోవడం నీడపట్టున శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదపడే ఆట లు ఆడేవారు. కానీ ఇప్పుడు 5జీ కాలం.. సెలవులు కాదు.. ఖాళీ టైం దొరికితే చాలు పిల్లలు సెల్‌కు అతుక్కుపోతున్నారు. రీల్స్‌ చూస్తూ, గే మ్స్‌ ఆడు తూ కాలక్షేపం చేస్తున్నారు. దీంతో కళ్లు దెబ్బతింటున్నా యి. శారీరక శ్రమ లేకపోవడంతో లేజీగా తయారవుతున్నారు. సెల్‌ లేకపోతే టీవీల కు అతుక్కుపోతున్నారు. ఈ నేపథ్యంలో చె న్నూర్‌ మండలం చాకెపల్లి సర్పంచ్‌ బల్ల సమ్మయ్య వినూత్న ఆలోచన చేశాడు. పిల్లల సెల్‌ఫోన్లు, టీవీలు చూస్తూ సమయం వృథా చేయకుండా, సమ్మర్‌ క్లాస్‌లు నిర్వహించే ఏ ర్పాటు చేశారు. సర్పంచ్‌ ఆలోచనకు తల్లి దండ్రులు సహకారం అందించారు. దీంతో సొంత డబ్బులతో ఒక ఉపాధ్యాయురాలిని నియమించి పాఠశాల ఆవరణలోనే చదువు చెప్పిస్తున్నాడు.

చల్లని వాతావరణంలో..

పిల్లల్లో క్రమశిక్షణ పెండంతోపాటు, పాఠాలపై పట్టు సాధించేలా ఉదయం వేళలోనే రెండు గంటలపాటు తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాల ఆవరణలోని చెట్ల నీడలో పాఠాలు బోధించే ఏర్పాటు చేశారు. ఈ నెల 11వ తేదీన ఈ తరగతులు ప్రారంభించారు. జూన్‌ 11 వరకు కొనసాగుతాయి. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. పిల్ల లు తాగేందుకు మినరల్‌ వాటర్‌ను కూడా తెప్పిస్తున్నారు. మొదటి రోజు 30 మంది విద్యార్థుల వరకు వచ్చారని సర్పంచ్‌ తెలిపారు. ఇప్పుడు రోజు 20 నుంచి 25మంది వరకు వస్తున్నారన్నారు.

ఎర్రగుంటపల్లిలో...

గతేడాది ఎర్రగుంటపల్లి సర్పంచ్‌ డెబ్బ సుగుణ, రామన్న అధికారంలోకి రాక ముందు కూడా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 16వ తేదీ నుంచి ప్రత్యేక తరగతులను ప్రారంభించారు. ఇక్కడ కూడా వేసవి సెలవులు ముగిసే వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందని సర్పంచ్‌ తెలిపారు.

బాగా చెబుతున్నారు

నేను ఇప్పుడు 2వ తరగతి చదువుతున్నాను. సెలవుల్లో పాఠాలు వినేందుకు వెళ్తున్నాం. టీచర్‌ మాకు పాఠాలు బోధిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ తరువాత ఇంటికి వెళ్లి ఆడుకుంటున్నాం.

– సుహాసిని, చాకెపల్లి

రోజూ వెళ్తున్నా..

నేను మూడో తరగతి చదువుకుంటున్నాను. సెలవుల్లో కూడా మాకు చదువు నేర్పిస్తున్నారు. ఉదయం రోజూవెళ్లి చదువుకుంటున్నాను. మాకు ఏమైనా సందేహాలు వస్తే టీచర్‌ చెబుతున్నారు.

– వర్షిణి, చాకెపల్లి

నీడ పట్టున పాఠాలు

సెలవుల్లో పిల్లలు సెల్‌ఫోన్లు, టీవీలకు అతుక్కు పోతున్నారు. పుస్తకాలు పట్టడం లేదు. ఇందు కోసం నేను పిల్లలకు పాఠాలు బోదించేందుకు ఏర్పాటు చేశారు. నీడ పట్టున ఉదయం 8 నుంచి 10గంటల వరకు పాఠాలు బోదించేందుకు ఉపాధ్యాయురాలిని నియమించాను.

– బల్ల సమ్మయ్య, సర్పంచ్‌, చాకెపల్లి

సమయం వృథా కాకుండా..

పిల్లలు వేసవి సెలవుల్లో ఆటలకే పరిమితం కాకుండా, సమయం వృథా కాకుండా ఉండేందుకు సర్పంచ్‌ ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశారు. ఉదయం పూట నీడ పట్టున పిల్లలకు పాఠాలు బోధిస్తున్నా.

– దుర్గం అంజలి,

ఉపాధ్యాయురాలు, చాకెపల్లి

Advertisement
 
Advertisement
Advertisement