జస్టిస్‌ చంద్రయ్య మృతికి సంతాపం | - | Sakshi
Sakshi News home page

జస్టిస్‌ చంద్రయ్య మృతికి సంతాపం

May 19 2026 12:10 AM | Updated on May 19 2026 12:10 AM

జన్నారం: హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, తెలంగాణ తొలి మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ గుండా చంద్రయ్య అకాల మృతికి జన్నారం మండలం తిమ్మాపూర్‌ గ్రామ పంచాయతీలో సోమవారం సంతాప సభ నిర్వహించారు. సర్పంచ్‌ సంగీత రవి నాయక్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గుండ చంద్రయ్య గ్రామానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లావణ్య, ఉపసర్పంచ్‌ నగేష్‌, మాజీ సర్పంచ్‌ జాడి గంగాధర్‌, మాజీ ఎంపీటీసీ వెంకటస్వామి, కమల, భూమయ్య, కే. గంగయ్య, చిందం చంద్రయ్య, ప్రెస్‌క్లబ్‌ మండల ప్రధాన కార్యదర్శి జాడి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement