మంచిర్యాలఅర్బన్: తెలంగాణ ప్రభుత్వ విద్యావ్యవస్థ విధ్వంసాన్ని ఆపాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వింత ధోరణితో విద్యారంగం ప్రస్తుతం విచిత్ర పరిస్థితుల్లో పయనిస్తోందన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరిట ప్రజాధనాన్ని కొల్ల గొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో డీఈవోలు, 596 మండలాల్లో రెగ్యులర్ ఎంఈవోలు లేరన్నారు. ఉపాధ్యాయుల డీఏ, పీఆర్‌సీల ఊసే లేకుండా పోయిందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి జయకృష్ణ, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీమన్నారాయణ, అశోక్, సంతోష్, గంగాధర్, శిల్ప, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.


