మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రతీ సోమవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి నేడు రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నిర్మల్ జిల్లా బాసర, ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు గమనించి సహకరించాలని ఆయన కోరారు.
అన్నివర్గాల ప్రజల
అభ్యున్నతికి కృషి
మంచిర్యాలటౌన్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తల కృషి వల్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు స్వలాభం, కుటుంబం కోసం మాత్రమే పనిచేస్తుండగా బీజేపీ మాత్రం దేశ ప్రగతి కోసం పాటుపడుతుందన్నారు. నేడు బీజేపీ ఆవిర్భావ వేడుకలను పార్టీ శ్రేణులు ప్రతీ పోలింగ్ బూత్‌లో ఘనంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో గాజుల ముఖేష్ గౌడ్, తుల ఆంజనేయులు, ఆకుల అశోక్‌వర్దన్, వంగపల్లి వెంకటేశ్వర్‌గౌడ్, బెల్లంకొండ మురళి, కమలాకర్‌రావు, నాంపల్లి శ్రీనివాస్, బోయిని దేవేందర్, కొండ వెంకటేశ్, రెడ్డిమల్ల అశోక్, తరుణ్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.
బాల్క సుమన్, దివాకర్‌రావు హౌస్ అరెస్ట్
మంచిర్యాలటౌన్/రామకృష్ణాపూర్: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావును ఆదివారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. క్యాతనపల్లిలోని సుమన్ నివాసంలో మందమర్రి సీఐ రమేశ్, పట్టణ ఎస్సై శ్రీధర్, నడిపెల్లి దివాకర్‌రావు నివాసంలో ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో వారిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తోందని, పోలీసులను ఉపయోగించి నిర్భంద పాలన సాగిస్తోందని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా ధర్మం, న్యాయం గెలుస్తుందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.


