తెరుచుకోని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం | - | Sakshi
Sakshi News home page

తెరుచుకోని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం

Apr 6 2026 9:24 AM | Updated on Apr 6 2026 9:24 AM

మంచిర్యాల జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం కలెక్టరేట్‌ ఆవరణలో నిర్వహిస్తున్నారు. ఇందులో ఒక డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. కనీసం అటెండర్‌ కూడా లేకపోవడంతో అతను కార్యాలయానికి వచ్చినప్పుడు మాత్రమే తెరుచుకుంటుంది. సిబ్బంది లేకపోవడం, తనిఖీలు, ఇతర కేసులకు సంబంధించి వెళ్లాల్సి వస్తుండడంతో కార్యాలయం ఎప్పుడో గానీ తెరుచుకోవడం లేదు. ఏదైనా ఫిర్యాదు చేసేందుకు బాధితులు కార్యాలయానికి వెళ్తే తాళం వేసి ఉంటోంది. దీంతో బాధితులు ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థంగాక వెనుదిరగాల్సి వస్తోంది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన కీలకమైన ఔషధ నియంత్రణ కార్యాలయంలో సరిపడా సిబ్బందిని నియమించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement