మంచిర్యాలఅగ్రికల్చర్: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్‌రామ్ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్ 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, శ్రీనివాస్‌రావుతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ 27 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారన్నారు. సామాజిక సమానత్వం కో సం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం సాగించిన రాజకీయ, సామాజిక వి ప్లవ యోధుడన్నారు. ఉప ప్రధానమంత్రిగా, రక్షణ, వ్యవసాయ, కార్మిక, రవాణా, రైల్వే, కమ్యూనికేషన్, ఉపాధి, పునరావాసం, ఆహార, రక్షణ, నీటిపారుదల శాఖ, కేంద్ర కేబినెట్ మంత్రిగా 30 ఏళ్ల పాటు పలు సేవలు అందించారన్నారు. 100 సంవత్సరాల తర్వాత పరిస్థితులను ముందే గ్రహించి రచించిన పుస్తకాలతో ప్రజలతో చైతన్యం తీసుకవచ్చారన్నారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారులు భాగ్యవతి, దుర్గాప్రసాద్, నగర మేయర్ ధరణి మధుకర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయం
మంచిర్యాలక్రైం: భారత ఉప ప్రధాన మంత్రిగా బా బు జగ్జీవన్‌రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా కొనియాడారు. ఆదివారం కమిషనరేట్ ప్రాంగణంలో బాబు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలోను, స్వరాజ్యం వచ్చిన తర్వాత ఆధునిక భారత నిర్మాణంలోనూ ఆయన స్ఫూర్తిదాయకమైన సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ ఏసీపీ నాగేందర్ గౌడ్, ఆర్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


