నేడు నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో సీఎం పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో సీఎం పర్యటన

Apr 6 2026 9:24 AM | Updated on Apr 6 2026 9:24 AM

బాసరలో రూ.225 కోట్ల పనులకు శంకుస్థాపన

మధ్యాహ్నం ఆదిలాబాద్‌ జిల్లా పిప్రిలో బహిరంగ సభ

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

భైంసా/బాసర/కై లాస్‌నగర్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం నిర్మల్‌ జిల్లా బాసర, ఆదిలాబాద్‌ జిల్లా పిప్రిలో పర్యటించనున్నారు. మొదట బాసర శ్రీజ్ఞాన సరస్వతి ఆలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి అన్నిశాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ తెలిపారు. బాసర మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా రూ.225 కోట్లతో చేపట్లే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహనం ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలం పిప్రి గ్రామంలో బహిరంగ సభలో పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement