జైపూర్: ఎస్టీపీపీ డిస్పెన్సరీలో మెరుగైన వైద్యసదుపాయాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్‌కుమార్ తెలిపారు. శనివారం ఆయన ఎస్టీపీపీని సందర్శించారు. ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం నర్సింహారావు ఆయనకు పుష్పగుచ్చం అందించి స్వాగ తం పలికారు. డిస్పెన్సరీని సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలు, సదుపాయాలపై ఆరా తీశారు. వైద్యసిబ్బందికి పలు సూచనలు చేశారు. డిస్పెన్సరీలో క్యాజువాలిటీ విభాగం ఏర్పాటు చేస్తామన్నారు. పీరియాడికల్ మెడికల్ పరీక్షలు(పీఎంఈ, ఐఎంఈ) ఇక్కడే నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సర్వీస్ బిల్డింగ్‌లో ని ర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వోఅండ్‌ఎం చీఫ్, జీఎం పీసీఎస్ మదన్‌మోహన్, డీజీఎం, సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పంతుల, డీజీఎం ప ర్సనల్ కిరణ్‌బాబు, డిప్యూటీ సీఎంవో రమేశ్‌బా బు, మెడికల్ సూపరింటెండెంట్ జానకి, ఎస్‌వోటూ ఈడీ వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.


