భైంసాటౌన్: ముగ్గురిపై దాడి చేసిన కేసులో నలు గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ సా యికుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఇటీవల పట్టణంలోని ఓ వైన్స్‌వద్ద బైక్ యూటర్న్ విషయమై కొందరు గొడవపడ్డారు. ఈ ఘటన గ్యాంగ్ గొడవకు దారితీసింది. ఈ క్రమంలో నలుగురు కలిసి ముగ్గురిపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో బాధితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దాడికి పాల్పడి న నలుగురు నిందితులను గుర్తించారు. వీరిని అరె స్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే, వీరికి ఆర్థి క సహాయం, ఆశ్రయం కల్పించిన మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. కేసును త్వరగా ఛేదించి నిందితుల ను పట్టుకున్నందుకు సీఐ సాయికుమార్, ఎస్సై కృష్ణారెడ్డి, నవనీత్, సిబ్బందిని ఎస్పీ జానకీ షర్మిల, ఇన్‌చార్జి ఏఎస్పీ సాయికిరణ్ అభినందించారు.


