కాసిపేట: మండలంలోని దుబ్బగూడెం శివారులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లతోపాటు జే సీబీని శుక్రవారం సాయంత్రం గ్రామస్తులు అడ్డుకున్నారు. రోజు వారీగా భారీగా ట్రాక్టర్లలో మట్టి తరలిస్తూ రోడ్లు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇష్టానుసారం మట్టిని తరలించి గుంతలమయంగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, త మకు సింగరేణి ఓపెన్‌కాస్టు అధికారుల అనుమతి ఉందని ట్రాక్టర్ల యజమానులు చెప్పగా, బయటకు మట్టి తరలింపు అనుమతి ఇచ్చే అధికారం మైనింగ్ అధికారులకే ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నా రు. సింగరేణి అధికారులు అనుమతి ఇచ్చింది ఓపె న్‌కాస్టు డంప్ వద్ద కాగా, ఆ పత్రాలు చూపి తమ గ్రామ సమీపంలో మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జేసీబీ, ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఎస్సై ఆంజనేయులును వివరాలు అడగగా ట్రాక్టర్లు, జేసీబీని తహసీల్దార్‌కు అప్పగించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


