దండేపల్లి: మండల కేంద్రమైన దండేపల్లిలో ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లిన కూలీలపై తేనేటీగలు దాడి చేశాయి. దండేపల్లి గ్రామానికి చెందిన 110మంది ఉపాధి కూలీలు గురువారం ఉదయం దండేపల్లి అడవిలో అటవీ ట్రెంచ్ తవ్వకాలకు వెళ్లారు. పనులు చేపట్టిన కొద్దిసేపటికే కూలీలపై తేనేటీగలు దాడి చేయడంతో పరుగులు తీశారు. 20మందిపై దాడి చేయడంతో 108అంబులెన్స్‌లో దండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న జిల్లపెల్లి గంగ, శశికుమార్, చీపిరిశెట్టి సత్తన్న, పద్మ, భీమోజు సుజాతలను లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


