రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని రింగన్‌ఘాట్ గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కెరమెరి ఎస్సై మధూకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొఠారి గ్రామానికి చెందిన మర్సకోల మహేశ్ (21), కొత్తగూడ గ్రామానికి చెందిన సిడాం జ్యోతీరాం బైక్‌పై అంబారావుగూడకు వెళ్లి నిత్యావసరాలు కొనుగోలు చేశారు. తిరిగి వస్తున్న క్రమంలో రింగన్‌ఘాట్ గ్రామ సమీపంలో కల్వర్టు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బైక్‌తో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మహేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, జ్యోతీరాంకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి అన్న యోత్మారామ్ ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


